Sunday, May 20, 2018

ఫస్ట్ లుక్: ఎన్టీఆర్ కిరాకు పుట్టించాడు







వచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా కాదు.. బ్యాంగ్ బ్యాంగ్ లుక్ తో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతను నటిస్తున్న కొత్త సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్ లాంచ్ అయిపోయాయి. ఈ చిత్రానికి ఫలానా టైటిల్ అంటూ ‘తుపాకి.కాం’ అంటూ ఈ రోజు ఉదయమే ఒక వార్త ఇచ్చింది. దాాపుగా ఆ టైటిలే ఫిక్స్ చేశారు. కానీ చిన్న ఛేంజ్ ఇచ్చారు. ‘అరవింద సమేత రాఘవ’ అనే టైటిల్ పేర్కొనగా.. దాన్ని ‘అరవింద సమేత వీర రాఘవ’గా మార్చారు. ఇందులో ‘అరవింద సమేత’ అన్నదే పెద్దగా కనిపిస్తూ.. ‘వీర రాఘవ’ను జంప్ లైన్ లాగా మార్చారు.

ఇక ఎన్టీఆర్ లుక్ గురించి ఏం చెప్పాలి? నెవర్ బిఫోర్ అన్నట్లే ఉంది. ఇంతకముందు ‘టెంపర్’ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు కానీ.. ఇప్పుడు మరింత పర్ఫెక్టుగా ఉంది. చేతిలో కత్తి పట్టి చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు తారక్. మాస్ కు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది ఈ లుక్. ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందన్న ప్రచారాలకు తగ్గట్లే పోస్టర్ బ్యాగ్రౌండ్ ఉంది. కాకపోతే ఎన్టీఆర్ లుక్ కు.. సినిమా టైటిల్ కు మ్యాచ్ కావట్లేదు. లుక్ మాస్ గా ఉంటే.. టైటిల్ చాలా క్లాస్ గా ఉంది. 

పూజా హెగ్డే కథానాయికగా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నాడు. ‘హారిక హాసిని క్రియేషన్స్’ బేనర్ మీద త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆయన మిత్రుడు ఎస్.రాధాకృష్ణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ దారుణమైన దెబ్బ కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఇద్దరు మిత్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

నాని పెంచుతాడా.. దించుతాడా?


https://youtu.be/76n9k2jubIs


అనేకానేక సందేహాలకు తెరదించుతూ గత ఏడాది తెలుగులోకి అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో అంచనాల్ని మించి విజయం సాధించింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్.. అతడి వాక్చాతుర్యం.. మరోవైపు పార్టిసిపెంట్ల ఆకర్షణ కూడా తోడై షో బాగానే విజయవంతమైంది. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ ఎలా నడుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా కొత్తగా ఉన్నపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకసారి దానికి అలవాటు పడ్డాక.. జనాలకు నెమ్మదిగా మొహం మొత్తడం మొదలవుతుంది. ఏదో ఒక ప్రత్యేకత.. కొత్తదనం ఆశిస్తారు. అది లేకుండా ఫలితం తేడా కొట్టేస్తుంది. ‘బిగ్ బాస్’ విషయంలోనూ ఆ ప్రమాదం పొంచి ఉంది. రెండో సీజన్ కు ఎన్టీఆర్ దూరం కావడం కచ్చితంగా షోపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

నిజానికి తొలి సీజన్లో ‘బిగ్ బాస్’ వైపు జనాలు చూడటానికి ముఖ్య కారకుడు ఎన్టీఆర్. అతడి వాక్చాతుర్యం.. పరిజ్ఞానం.. ఆకర్షణ మీద అందరికీ నమ్మకం ఉండి.. బుల్లితెరపై అతడి మేనియా ఎలా ఉంటుందో చూడాలని అందరూ ‘బిగ్ బాస్’పై ఓ కన్నేశారు. అంచనాలకు తగ్గట్లే షోను అద్భుతంగా నడిపించి విజయవంతం చేశాడు తారక్. నాని కూడా తెలివైన వాడే. వాక్చాతుర్యం ఉన్నవాడే. అతడికీ జనాల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ ఎన్టీఆర్ తో పోలిస్తే షోను ఏ మేరకు రక్తి కట్టిస్తాడన్నది చూడాలి. ఎన్టీఆర్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ ‘బిగ్ బాస్’కు కలిసొచ్చింది. అతడి కోసమే లక్షల మంది షో చూసేవాళ్లు. నాని అలా ఆకర్షణ మంత్రం వేయగలడా అన్నది సందేహం. రెండో సీజన్ కు ఎన్టీఆర్ లేడనగానే అతడి అభిమానులు నిట్టూర్చేశారు. తమ నిరాసక్తతను ఆల్రెడీ సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో చూపిస్తున్నారు. అదే సమయంలో నానికి స్వాగతం చెబుతూ.. షో మీద ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లూ ఉన్నారు. మరి ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. రెండో సీజన్ ఆరంభ ఎపిసోడ్లకు వచ్చే టీఆర్పీ రేటింగ్ లతోనే షో భవితవ్యం ఏంటన్నది తెలిసిపోతుంది. ఎన్టీఆర్ దూరమైన ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది.. నాని ఏమాత్రం షోను రక్తి కట్టిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. నాని అండ్ కో గత ఏడాది ఉన్న ఆదరణను అలాగే కొనసాగిస్తారా.. లేక పెంచుతారా.. లేదా తగ్గిస్తారా అన్నది చూద్దాం మరి.


ఆ బయోపిక్ లో శర్వా కూడానా?



సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్నో ఒడుదుడుకులు. బాలకృష్ణ ముందుండి నడిపించే ఎన్టీఆర్ బయోపిక్ కి ఎవరు ఊహించని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. బాలయ్య ఉన్నా కూడా ఈ ఇబ్బందులు ఏమిటో అనే టాక్ బాగా వచ్చింది. అయితే ఫైనల్ గా నందమూరి హీరో బయోపిక్ స్పీడ్ ను పెంచే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక దర్శకుడు తేజ తప్పుకోవడంతో బాలయ్య తనకు 100వ సినిమాతో జీవితంలో గుర్తిండిపోయే హిట్ ఇచ్చిన క్రిష్ ను లైన్ లో పెట్టాడు. దాదాపు ఆయనకు ఆవకాశం దక్కినట్లే అని తెలుస్తోంది. అలాగే బయోపిక్ లో కీలకమైన చంద్రబాబు పాత్రకు రానాను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా స్క్రిప్ట్ విన్న రానా సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇకపోతే మరో ముఖ్యమైన పాత్ర కోసం బాలయ్య గత కొంత కాలంగా చాలా సెర్చ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక యువ ఎన్టీఆర్ గా శర్వానంద్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉండేవారు. ఆ ఏజ్ మాదిరిగా బాలయ్య కనిపించాలి అంటే కష్టం. సన్నాబడాలని ట్రై చేసినా కూడా సమయం సరిపోదు. అందుకే శర్వానంద్ ని ఒకే చేసినట్లు సమాచారం. ఇక విద్యా బాలన్ బసవతారకం క్యారెక్టర్ కి రీసెంట్ గా ఒప్పుకున్నారు.

అందుకే నేల టిక్కెట్టు టైటిల్ పెట్టాం



సోగ్గాడే చిన్ని నాయన - రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇక ఈ సారి నేల టిక్కెట్టు తో కూడా మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సినిమాపై అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలానే ఉన్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను పెంచింది. శక్తి కాంత్ అందించిన సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచుతోంది.

ఇక ఈ విజయంపై పూర్తిగా నమ్మకంతో ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ తో కూడుకున్నది. తప్పకుండా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. నేల టిక్కెట్టు సినిమా బాల్కనీ వాళ్లకు కూడా నచ్చుతుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కూడా మాతో ఇదే చెప్పారు. రవితేజ కామెడీ అండ్ ఫైర్ రెండు ఈ సినిమాలో ఉంటాయి. హీరో పాత్ర ఆవారా అయినా కూడా అతను తన లైఫ్ లో ఎంతమందిని కలుపుకొని ఒక ఫ్యామిలీ గా సెట్ చేసుకున్నాడు అనేదే సినిమా కథ.

ఈ కథలో హీరో ఎక్కువగా మాస్ జనాలతో తీరుగుతూ ఉంటాడు. అందుకే నెల టిక్కెట్టు అనే టైటిల్ ని పెట్టాం. ఈ సినిమా షూటింగ్ ని కేవలం 90 రోజుల్లోనే ఫినిష్ చేశాం. రవి తేజతో వర్క్ చెయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇక ఆయనలోని కమిట్మెంట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. చాలా నేర్చుకున్నా కూడా.. నా సినిమా చివరి రోజు షూటింగ్  ముగియగానే మైత్రీ మూవీ మేకర్స్ వారి సినిమాను మొదలు పెట్టారు. ఆ కమిట్మెంట్ అందరికి ఉండదు. ఇక హీరోయిన్ మాళవిక కూడా సినిమాలో అద్భుతంగా నటించిందని చెబుతూ.. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వివరించారు.


అరవింద స్వామికి పుత్రోత్సాహం!




పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు.....జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.... కన్న కొడుకులు పేరు ప్రఖ్యాతలు సంపాదించినపుడు ఈ సుమతీ శతకాన్నిస్మరించుకుంటాం. కన్నతండ్రి ఎంత గొప్పవాడైనప్పటికీ....తన కొడుకు గొప్పవాడైనపుడు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినపుడు ఆ తండ్రి పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. సరిగ్గా ఇపుడు అదే ఆనందాన్ని కోలీవుడ్ వెటరన్ యాక్టర్ అలనాటి హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి పొందుతున్నాడు. ప్రస్తుతం....అరవింద స్వామి తన కొడుకు రుద్ర స్వామిని చూసి గర్వ పడుతున్నాడు. ఐబీ ప్రోగ్రామ్ నుంచి రుద్ర స్వామి గ్రాడ్యుయేట్ కావడంతో అరవింద స్వామి చాలా సంతోషంగా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ అయిన తన కొడుకు రుద్రస్వామిని చూసి గర్వంగా ఉందంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ హ్యాండ్సమ్ తండ్రీ కొడుకుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వారసుడిని అరవింద స్వామి తెరంగేట్రం చేయిస్తాడో లేదో వేచి చూడాలి. 

90 వ దశకంలో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హ్యాండ్ సమ్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు అరవింద స్వామి. బొంబాయి మెరుపు కలలు దళపతి వంటి పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న అరవింద స్వామి....తనీ ఒరువన్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఆ సినిమా రీమేక్ `ధృవ`లో కూడా నటించి టాలీవుడ్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం స్టైలిష్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అరవింద స్వామి దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా తమిళ చిత్రం `భాస్కర్ ఒరు రాస్కల్`...బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హ్యాండ్సమ్ తండ్రీ కొడుకుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వారసుడిని అరవింద స్వామి తెరంగేట్రం చేయిస్తాడో లేదో వేచి చూడాలి.

Saturday, May 19, 2018

Nela Ticket Raviteja Movie Release Date 24 May 2018




The makers of Ravi Tejastarrer ‘Nela Ticket’ have announced that the teaser of the film will be out on April 22. The teaser will be released by their online video channel of SRT Entertainments. Directed by Kalyan Krishna Kurasala, ‘Nela Ticket’ is slated to release in May.

‘Nela Ticket’ story reportedly revolves around a care-free guy who fights for the justice for their people of the village. In the film, Ravi Teja will be seen in a yet another mass character which would entertain the audience for sure. Malvika Sharma is playing leading lady in the film.


The film also stars Jagapathi Babu, Brahmanandam, Jayaprakash Reddy, Raghu Babu, Subbaraju, Ali, Posani Krishna Murali, Annapurnamma, Priyadarshi Pulikonda, Prabhas Srinu, Prudhvi Raj, Surekha Vani, Praveen and others. While the music for the film has been composed by Shakthikanth Karthick, the cinematography has been done by Mukhesh G and editing by Chota K Naidu.


Get latest news & live updates on the go on your pc with News App. Download The Times of India news app for your device. Read moreEntertainment news in English and other languages.

Saaho: Interesting facts about the Prabhas and Shraddha Kapoor starrer


After the stupendous success of 'Baahubali' series, fans are eagerly waiting for Prabhas’ next project 'Saaho'. The film has been in the news ever since the teaser of the movie was out. The team is currently shooting for the same in Abu Dhabi.

According to recent reports, Shraddha has also now joined the sets of the Prabhas starrer for its Abu Dhabi schedule. Reportedly the schedule will focus on shooting slick action sequences and a thrilling chase. Reports even have it that the sequences will involve the use of bikes, cars, trucks, and helicopters. Renowned choreographer Kenny Bates will reportedly be canning the action sequences.

'Saaho' is directed by Sujeeth and the music of the film will be done by the awesome trio of Shankar-Ehsaan-Loy and lyrics by the very talented Amitabh Bhattacharya. 'Saaho' will be released in Telugu, Tamil, Hindi, and Malayalam simultaneously.

Apart from this Shraddha Kapoor will also be shooting for Shree Narayan Singh's 'Batti Gul Meter Chalu' along with Shahid Kapoor and Yami Gautam. Shraddha is also lined up with the upcoming horror-comedy titled 'Stree' opposite Rajkummar Rao.

ఫస్ట్ లుక్: ఎన్టీఆర్ కిరాకు పుట్టించాడు

వచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా కాదు.. బ్యాంగ్ బ్యాంగ్ లుక్ తో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతను నటిస్తున్న కొత్త సినిమ...